కొడుకుతో కలిసి వచ్చిన పవన్

పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్ ని హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి “ఓజి” సినిమాలో టీనేజ్ పవన్ కళ్యాణ్ గా అకీరా నటిస్తాడని భావించారు. దర్శకుడు సుజీత్ అలా ప్లాన్ కూడా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు.
ఇక తాజాగా అకీరా నందన్ తన తండ్రితో కలిసి ఒక ఈవెంట్ లో కనిపించడం విశేషం. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందుగా “సర్గం 2025” పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు.
దీనికి పవన్ తనయుడు కూడా హాజరయ్యాడు. వీరు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్న ఈ ఫోటోలను అభిమానులు ఆనందంగా షేర్ చేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. అకీరా ఇప్పటికే హీరోకి కావాల్సిన లుక్స్ పొందాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఒకవేళ పవన్ తన సినిమాలకి చాలా కాలం బ్రేక్ ఇస్తే… అకీరాకి మంచి క్రేజ్ వస్తుంది.