నేను యుద్ధం ప్రకటించను: పవన్ కల్యాణ్

- Advertisement -
Pawan Kalyan


పోసాని, ఇతర వైఎస్సార్సీ పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ ని బండ బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. జనసేన పార్టీ మీటింగ్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్… తను వైఎస్సార్సీ పార్టీ నాయకులు, వారి కార్యకర్తల కుటుంబ సభ్యులని ఏమి అనను అని చెప్పారు. అది తన పద్దతి కాదు అని తేల్చారు.

“నా అంతట నేను ఎప్పుడూ యుద్ధం ప్రకటించను. కానీ అనవసరంగా నన్ను యుద్ధక్షేత్రంలోకి లాగితే వెనక్కి తగ్గేది లేదు. ఎవరు తిట్టినా పట్టించుకోను… కానీ అందరిని గుర్తుపెట్టుకుంటాను,” అంటూ పార్టీ కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు జనసేనాని.

‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో పవన్ చేసిన కామెంట్లతో మొదలైన రచ్చ ఇంకా సద్దుమణగలేదు.

 

More

Related Stories