
“గో కరోనా గో” అనే మంత్రం చదివి … ఇక దేశం నుంచి కరోనా పోతుందని హంగామా చేశారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే. మహారాష్ట్రలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) అధ్యక్షుడు ఆయన. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి. అలా కేంద్రమంత్రి అయ్యారు. మోదీ భజన చేసే ఈ కేంద్రమంత్రి కరోనా మంత్రం చదివి ట్రోలింగ్ కి గురయ్యారు. ఆయన మంత్రం చదివినా దేశం నుంచి కరోనా పోలేదు…పైగా ఆయనకిప్పుడు కరోనా సోకింది.
ఆయన కరోనా పాజిటివ్ అని ఈ రోజు పరీక్షల్లో తేలింది. దాంతో హీరోయిన్ పాయల్ ఘోష్ కి భయం పట్టుకొంది. ఎందుకంటే… నిన్నే (అక్టోబర్ 26) ఆమె రాందాస్ అథవాలే పార్టీలో చేరింది. ఆయన చేతుల మీదుగానే పార్టీ కండువా కప్పుకొంది. ఆయనకీ ఆల్రెడీ కరోనా ఉంది కానీ ఆయనకు తెలియదు. ఇప్పుడు పాయల్ ఐసోలేషన్ లో ఉండాలి. ఆమె చేయించుకోవాలి.

తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించిన ఈ భామ ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైగింక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె ఇప్పుడు ట్రోలింగ్ కి గురి అవుతోంది.