తండ్రీకొడుకుల పాటలు వైరల్

TeluguCinema 10 Nov 2025
chiranjeeviramcharan

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు”, రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” రెండూ షూటింగ్ జరుపుకుంటూనే పాటల ప్రచారం మొదలుపెట్టాయి. “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతికి విడుదల కానుంది. “పెద్ది” మార్చిలో విడుదల.

ఈ రెండు సినిమాల మొదటి పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి మొదటి పాటగా “మీసాల పిల్ల” అనే టీజింగ్ పాట వచ్చింది. నయనతారని మీసాల పిల్ల అని టీజ్ చేస్తూ చిరంజీవి పాడే ఈ పాట బాగా క్లిక్ అయింది. ఎన్నో రీల్స్ వచ్చాయి ఈ పాటపై. ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ దక్కాయి.

‘పెద్ది’ సినిమా నుంచి మొదటి పాటగా “చికిరి చికిరి” అనే సాంగ్ వచ్చింది. రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాట రామ్ చరణ్, జాన్వి కపూర్ పై చిత్రీకరించారు. “చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌ లో ఉంది. రామ్ చరణ్ తన ప్రియురాలు జాన్వీకపూర్ అందం గురించి వర్ణిస్తూ వెంటపడే పాట ఇది. మోహిత్ చౌహన్ పాడారు. మొదటి పాట బాగా క్లిక్ అయింది.

ఇలా ఒకేసారి తండ్రీ కొడుకుల పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం విశేషం.