
‘రాధేశ్యామ్’ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజల మధ్య ఎదో భేదాభిప్రాయం వచ్చిందని, ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి అని తెలుగుసినిమా.కామ్ అప్పట్లో న్యూస్ బ్రేక్ చేసింది. కానీ, అదంతా అబద్దమని ప్రభాస్ PR టీం ఇతర మీడియాల్లో వార్తలు రాయించుకొంది.
ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ప్రొమోషన్ కోసం ముంబై, చెన్నై… ఇలా పలు నగరాలు తిరుగుతున్నారు. ఆ ఈవెంట్లలో ప్రభాస్, పూజ హెగ్డే మధ్య బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలు తెలుగుసినిమా.కామ్ రాసింది నిజమని అర్థమవుతుంది. ఇద్దరి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. ఇద్దరూ ‘ఫ్రీ’గా మూవ్ కావడం లేదు.
ప్రమోషన్ కోసం కలిసి కూర్చోవడం, మాట్లాడుతున్నారు. కానీ, వాళ్ళు పడుతున్న ‘ఇబ్బంది’ తెలిసిపోతోంది. పూజ హెగ్డే మాత్రం అన్ని చోట్లా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతి ఈవెంట్ కి హాజరు కావడం చేస్తోంది. ప్రభాస్ తో కూర్చొని ఉన్నప్పుడు కొంత బెరుకుగా మాట్లాడుతోంది. మిగతా టైంలో చలాకీగా కనిపిస్తోంది.

ఐతే, ఆమె ఒక్కో ఈవెంట్ కి ఒక్కో రకమైన డ్రెస్సింగ్ లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు కలిగిస్తోంది.