జ్ఞాపకాలతో హీటేక్కిస్తున్న పూజ!


కోవిడ్ 19 మూడో వేవ్ తో మరోసారి షూటింగ్ లు అన్ని నిలిచిపోయాయి. దాంతో, పూజ హెగ్డేకి పని లేకుండా పోయింది. షూటింగులు షురూ అయ్యేంతవరకు ఆమె ఇంట్లోనే ఉండాలి కదా. టైంపాస్ కోసం ఆమె ‘జ్ఞాపకాలను’ నెమరువేసుకుంటోంది.

గతేడాది ఆమె యూరోప్, మాల్దీవుల వెకేషన్ కి వెళ్ళింది. ఆ వెకేషన్ కి సంబంధించిన పాత ఫోటోలను షేర్ చేస్తూ ఆ రోజులను గుర్తు చేసుకుంటోంది.

ఐతే, ఆమె వెకేషన్ పాత ఫోటోలు కూడా ఇన్ స్టాగ్రామ్ టైంలైన్ ని వేడెక్కిస్తున్నాయి. ఈ వింటర్ లో ఆమె వేడి పుట్టించే బికినీ ఫోటోలను షేర్ చేస్తోంది మరి. మాల్దీవుల వెకేషన్ కి సంబందించిన బికినీ ఫోటోలు కాక రేపుతున్నాయి. టాలీవుడ్ లో మంచి బికినీ బాడీ ఉన్న అందాల సుందరి పూజ హెగ్డే. ఆ విషయం ఆమెకి తెలుసు. అందుకే, తరుచుగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మురిపిస్తుంటుంది.

పూజ హెగ్డే ఇప్పటికే తాను ఒప్పుకున్న అన్ని చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసింది. కొత్తగా మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ చెయ్యాలి.

Advertisement
 

More

Related Stories