పూనమ్ కి ఆ ఆసక్తి లేదంట

Poonam Kaur


పూనమ్ కౌర్ ఇటీవల తరుచుగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ కూడా హీటెక్కించే ఫోటోలు అప్డేట్ చేస్తుండడంతో ఆమె మళ్ళీ హీరోయిన్ గా నటించే ప్రయత్నాలు మొదలు పెట్టిందా అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ ఆమెకిప్పుడు అలాంటి ఆసక్తి లేదని పూనమ్ టీం చెప్తోంది.

నితిన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలోనే ఆమె హీరోయిన్ కి అక్కగా కనిపించింది. అంటే… ఆమె హీరోయిన్ పాత్రల నుంచి తప్పుకొంది. రాజకీయాలు, ఆధ్యాత్మిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది పూనమ్.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలను కేవలం సరదాగా మాత్రమే షేర్ చేస్తోంది అని చెప్తున్నారు. హీరోయిన్ గా అవకాశాల కోసం ఆ ప్రయత్నాలు చెయ్యడం లేదట.

ఆ మధ్య పూనమ్ కౌర్ కొన్ని వివాదాల్లో ఇరుక్కొంది. ట్విట్టర్లో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు పోస్ట్ చేసేది. కానీ, ఇప్పుడు ఆ జోరు తగ్గింది. అలాంటి కాంట్రవర్సీలు ఏమి క్రియేట్ చెయ్యడం లేదిప్పుడు.

Advertisement
 

More

Related Stories