ఓపెనింగ్ లో ప్రభాస్ ‘సత్తా’

Salaar

“బాహుబలి” సినిమాతో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ వచ్చింది. బాహుబలికి ముందు ఉన్న క్రేజ్ వేరు, ఆ తర్వాత వచ్చిన క్రేజ్ వేరు. ప్రభాస్ ప్రతి సినిమాకి భారీ ఓపెనింగ్ ఉంటుంది అని తెలుసు. కానీ, అసలైన సత్తా “బాహుబలి 2” తర్వాత మరే సినిమా బయటపెట్టలేదు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “రాధేశ్యామ్”, “ఆదిపురుష్” ప్రభాస్ “సత్తా”ని తగ్గించాయి.

సరిగ్గా ఇలాంటి టైంలో విడుదలైంది “సలార్”. ప్రభాస్ కున్న నిజమైన క్రేజ్, అతనికి ఉన్న ఓపెనింగ్ సత్తా ఏంటో మరోసారి అందరికీ పరిచయం చేసింది “సలార్”.

“సలార్”కి మిక్సెడ్ టాక్ ఉంది. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో ఒకటే టాక్… అదుర్స్. 2023లో “లియో”, “జవాన్”, “పఠాన్” వంటి భారీ బ్లాక్ బస్టర్లను చూసింది ఇండియన్ సినిమా. వాటిని మించి “సలార్”కి ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దక్కిన వసూళ్ల లెక్క ప్రకారం “సలార్’ మొదటి స్థానంలో ఉంది అని చెప్పొచ్చు.

మొదటి రోజు దాదాపు 165 కోట్లు గ్రాస్ పొందినట్లు అంచనా. ఐతే, ఈ సినిమా తెలుగు వర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానం హిందీది. తమిళ్, మలయాళ భాషల్లో మోస్తరు అమౌంట్ వచ్చింది.

Day 1: Salaar posts second best record in Nizam

ఓవరాల్ గా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ కలెక్షన్ల పరంగా వర్కవుట్ అయింది. మొదటి రోజు వసూళ్లు ఇలా ఉంటే రేపు (ఆదివారం), ఎల్లుండి (క్రిస్మస్ పండగ) ఎలా ఉంటాయో ఊహించుకొండి. సో… నాలుగు రోజుల పాటు భారీ వసూళ్లతో సలార్ హంగామా ఉంటుంది.

Advertisement
 

More

Related Stories