ప్రభాస్ కి జ్వరమొచ్చిందట!

Prabhas

“ప్రభాస్ కి అస్వస్థత….”
“ప్రభాస్ కి బెడ్ రెస్ట్…. “
“ప్రభాస్ హాస్పిటల్లో నిర్మాతకి టెన్షన్ ..”

ఇలాంటి హెడింగ్ లు, థంబ్ నెయిల్స్ తో మీడియాలో హడావిడి జరిగింది. దాంతో, అభిమానులు కొంత ఆందోళన పడ్డారు. కానీ, ప్రభాస్ కి సాధారణ జ్వరం వచ్చింది. పని ఒత్తిడితో వచ్చిన చిన్న ఇబ్బంది. అంతకుమించి సీరియస్ గా ఏమి లేదు. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రభాస్ కి పెద్ద అనారోగ్యం వచ్చినట్లు ప్రచారం జరిగింది.

వరుసగా షూటింగ్ లు చేస్తున్నాడు ప్రభాస్. దాంతో, అలసిపోయాడు. ఆ వర్క్ ఫ్రెజర్ లో వచ్చిన ఫీవర్ ఇది. ఒక రెండు, మూడు రోజుల విశ్రాంతి తర్వాత షూటింగ్ లో పాల్గొంటాడట. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కానుంది. అందుకే, ఏప్రిల్ లోపు టాకీ పార్ట్ పూర్తి చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ పట్టుదలగా ఉన్నాడు. దాంతో, ప్రభాస్ రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తోంది.

ఇక, ‘సలార్’ కాకుండా ‘ప్రాజెక్ట్ కె’, మారుతి డైరెక్షన్లో ఒక మూవీ ఉంది.

Advertisement
 

More

Related Stories