చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ డాన్స్

TeluguCinema 12 Sep 2025
Prabhas

ప్రభాస్ వెండితెరపై డాన్స్ చేసి చాన్నాళ్లయింది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అతడు డాన్స్ చేసిన దాఖలాల్లేవు. ‘సలార్’ లాంటి సినిమాల్లో అసలు డ్యూయట్లే లేవు. ఇలా చాన్నాళ్లుగా డాన్స్ కు దూరమయ్యాడు.

ఎట్టకేలకు ఈ లోటును భర్తీ చేయబోతున్నాడు ప్రభాస్. ‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ పై ఓ మంచి డాన్స్ నంబర్ ఉంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ లోనే ప్రభాస్ ఉన్నాడట.

చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో ఫాస్ట్ గా డాన్స్ చేశాడట. మామూలుగానే ప్రభాస్, భారీ స్టెప్పులకు దూరం. అలాంటిది ‘రాజాసాబ్’ లో అతడు ఫాస్ట్ గా డాన్స్ చేశాడంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది.

సంక్రాంతి కానుకగా జనవరి 9న రాబోతోంది ‘రాజాసాబ్’ సినిమా. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్.