వింటేజ్ వెహికిల్స్ మోజులో ప్రభాస్!

Prabhas

పాత కార్లు, పాత బైకులు అంటే కొంత మందికి చాలా ఇష్టం. లక్షలు, కోట్లు పెట్టి వింటేజ్ వెహికిల్స్ కొంటూ ఉంటారు. హీరో ప్రభాస్ కి నిజజీవితంలో ఆ మోజు లేదు కానీ. ఆయన సినిమాల విషయానికి వస్తే… వాటికే ప్రాధ్యానముంది.

ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం… 1970లలో జరిగే కథ. ఆ సినిమా కోసం అప్పటి కార్లు కొనుగోలు చేశారు. ‘రాధే శ్యామ్’లో ఆనాటి వింటేజ్ కార్లు దర్శనమిస్తాయి.

ఇక ‘సలార్’ సినిమా కోసం ఏకంగా పాతకాలపు బుల్లెట్, ఎన్ ఫీల్డ్ తరహాలో బైక్ ని డిజైన్ చేయించి వాడుతున్నారట. ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో కూడా వింటేజ్ వెహికిల్స్ కనిపిస్తాయట.

ప్రభాస్ తో సినిమా అనగానే దర్శకులు ఖర్చుకు వెనుకాడడం లేదు. యాక్షన్ సీన్ల కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే… ప్రభాస్ సినిమాకి బిజినెస్ కూడా అదే రేంజులో అవుతోంది. అందుకే, ఎలాంటి కారులు, బైకులైనా కొనేస్తున్నారు. ‘సాహో’ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టి భారీ వెహికిల్స్ కొన్నారు. వాటిని ఫైట్ సీన్స్ లో కాల్చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ చిత్రాలే. ‘రాధే శ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక త్వరలోనే ‘సలార్’ సినిమా షురూ అవుతుంది.

Advertisement
 

More

Related Stories