
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన డేటింగ్ కబుర్లు విప్పింది. ఎవరితోనైనా డేటింగ్ కి వెళ్ళినప్పుడు మొదటిరోజే ముద్దు అడిగితే ఒప్పుకోను అంటోంది. ముందు ముచ్చట. ఆ తర్వాతే ముద్దు.
ఒకరికి ఒకరు కొద్దిగా అర్థమై, మనసులు కలిస్తేనే పెదవులు కలిపేందుకు అంగీకరిస్తుందట. ఇలా డేటింగ్ సూత్రాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ప్రస్తుతం ఎవరితో డేటింగ్ లో ఉందో? ఆ విషయం చెప్పలేదు మరి.
ప్రగ్యా జైస్వాల్ గతంలో ఒక తెలుగు దర్శకుడితో చాలాకాలం ప్రేమాయణం నడిపినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందులో నిజమెంతో తెలీదు. ప్రస్తుతం ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది హిట్టయితే ఆమె దశ తిరుగుతుంది.
అందచందాలతో ఆకట్టుకునే ఈ సుందరి మరో రెండు తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు పొందనుందట. ఆ చర్చలు సాగుతున్నాయి.