బ్రేక్ లో భర్తతో టూర్లు

TeluguCinema 29 Oct 2025
Priyanka Chopra

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఒక తెలుగు సినిమాల నటిస్తోంది. రాజమౌళి తీస్తోన్న భారీ చిత్రంలో ఆమె ప్రధాన కథానాయిక.

సాధారణంగా రాజమౌళి ఒకసారి ఒక సినిమా మొదలు పెడితే తన హీరో, హీరోయిన్లకు వేరే సినిమాలు చేసేందుకు టైం ఇవ్వడు. అలాగే గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే కనీసం రెండేళ్లు కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారు రాజమౌళి. పెర్ఫెక్షన్ కోసం ఆయన తన నటులను ఎక్కువ టైం షూటింగ్ లోనే ఉంచుతాడు.

కానీ ప్రస్తుతం తీస్తున్న సినిమా విషయంలో ఆయన కొంత స్టయిల్ మార్చారు. పది రోజుల షూటింగ్ చేసి నెల రోజుల గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ సారి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో చేస్తున్నారు. దాంతో, షెడ్యూల్ కి, షెడ్యూల్ కి మధ్య చాలా గ్యాప్ ఉంటోంది.

దాంతో హీరో మహేష్ బాబు ఎప్పటిలాగే టూర్లు వేస్తున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తన భర్త నిక్ జోనస్ కండక్ట్ చేసే మ్యూజికల్ కాన్సర్ట్ లకు వెళ్తోంది. ఆమె కూడా భర్త టూర్లకు అటెండు అవుతోంది.