త్రికోణం… అలియా, ప్రియాంక, కత్రిన!


ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రిన… వీరితో ఒక సినిమా తీస్తున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్. ఇది ఫిమేల్ మల్టీస్టారర్. ఈ సినిమాని ఈ రోజు ప్రకటించారు. దిల్ చాహతా హై, లక్ష్య, డాన్, డాన్ 2 వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన ఫర్హాన్ 10 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత డైరెక్షన్ చేస్తున్నారు.

“జీ లే జరా” (కొంచెం జీవించు!) అనే పేరుతో రూపొందే ఈ మూవీ ముగ్గురు మహిళలు చేసే రోడ్ ట్రిప్ చుట్టూ తిరిగే కథ. అంటే ‘దిల్ చాహతా హై’, ‘జిందగీ నా మిలేగి దూబారా’ సినిమాలకు ఫిమేల్ వర్షన్ అన్నమాట. అలియా భట్ దేశంలో ఉన్న ప్రతి పెద్ద దర్శకుడితో వర్క్ చేస్తోంది. రీసెంట్ గా రాజమౌళి, భన్సాలీ డైరెక్షన్ లో నటించిన ఈ భామ ఇప్పుడు ఫర్హాన్ దర్శకత్వంలో కూడా నటించనుంది.

పెళ్ళై అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా కూడా ఇప్పటికీ బాలీవుడ్ చిత్రాలు ఒప్పుకుంటుండడం విశేషమే. ఇక ఇన్నేళ్ల తర్వాత కూడా కత్రినకి హీరోయిన్ రోల్స్ వస్తుండడం కూడా చెప్పుకోదగ్గ మ్యాటర్.

Advertisement
 

More

Related Stories