డ్రాగన్, అది వేరే వేరే లెవల్!

TeluguCinema 28 Sep 2025
NTR and Prashanth Neel

“కాంతార చాప్టర్ 1” ఈవెంట్ లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఈ రోజు మాట్లాడారు. ఈ సినిమా మీరు ఊహించిన దాని కన్నా వేరే లెవల్లో ఉంటుంది అని అభిమానులకు ధీమాగా చెప్పారు రవిశంకర్.

ఇటీవల ఎన్టీఆర్ గాయపడడంతో షూటింగ్ ఆగింది. ఇప్పుడు ఎన్టీఆర్ కోలుకున్నారు కాబట్టి దసరా తర్వాత షూటింగ్ మళ్ళీ మొదలుపెడతారు.

“వచ్చే నెల షూటింగ్ షెడ్యూల్ మొదలై పూర్తయ్యేవరకు నిరవధికంగా సాగుతుంది. మేం ప్రామిస్ చేసినట్లుగానే బెస్ట్ డేట్, బెస్ట్ రిలీజ్ అచీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. చెప్పిన డేట్ కే విడుదల చేస్తాం. సినిమా ఐతే అది ఇక మీ ఆలోచనకు వదిలేశాం. అది వేరే వేరే వేరే లెవల్,” అని హైప్ పెంచేశారు నిర్మాత రవి.

ఎన్టీఆర్ ఇటీవల “వార్ 2” సినిమాతో కొంత ఇబ్బంది పడ్డారు. ఎంతో ఆశ పెట్టుకుంటే ఆ సినిమా ఫలితం బాగా నిరాశపరిచింది. అందుకే, అభిమానులు ప్రశాంత్ నీల్ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాత రవి చెప్పిన మాటలతో వారికి నమ్మకం కుదిరింది.

ఈ సినిమాకి “డ్రాగన్” అనే టైటిల్ అనుకుంటున్నారు.