మళ్ళీ భార్య చెంతకు పూరి!

- Advertisement -
Puri Jagannadh and his wife Lavanya

పూరి జగన్నాధ్ సినిమా జీవితంలోకి ఛార్మి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ కేరీర్ ప్లానింగ్ మొత్తం ఆమె చూసుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో అప్పులు తీరి మళ్ళీ ఫైనాన్సియల్ గా పూరి సెట్ కావడానికి కారణమే ఛార్మినే. ఐతే, “లైగర్” విషయంలో వీరి లెక్క తప్పింది. ఇప్పుడు మళ్ళీ “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్ లా రామ్ పోతినేనితోనే హీరోగా పూరి సినిమా తీస్తున్నారు. ఛార్మి ఆ పనిలోనే ఉన్నారు.

మరోవైపు, పూరి జగన్నాధ్, ఆయన భార్య మధ్య కూడా సంబంధాలు బాగున్నాయి అని అర్థమవుతోంది.

తాజాగా ఆమె ఒక ఫోటో షేర్ చేశారు. ఆమె భర్త తనని కౌగిలించుకుంటున్న ఫోటోని ఆమె ఆనందంగా “జగ్గూ” అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పూరి జగన్నాధ్, ఆయన భార్య లావణ్య పేట్ల చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో గొడవలు అయ్యాయి అని, అందుకే పూరి జగన్నాధ్ ముంబైకి మకాం మార్చాడని పుకార్లు షికార్లు చేసిన మాట నిజం.

కానీ, ఈ జంట ఇంకా భార్యాభర్తలుగానే కలిసి ఉంటున్నారు అని ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది. చిన్న చిన్న గొడవలుండొచ్చు. అది సహజం. ఐతే ఈ జంట ఇంకా కలిసే ఉన్నారు. పూరి భార్య, అయన ఇద్దరు పిల్లలు ఆకాష్ పూరి, పవిత్ర హైదరాబాద్ లోనే ఉంటారు. ఇక ఇప్పుడు పూరి కూడా హైదరాబాద్ వచ్చారు. రామ్ తో సినిమా మొదలు పెడుతున్నారు.

More

Related Stories