రాశి ఖన్నా నుంచి మరోటి వచ్చింది!

రాశి ఖన్నా ఈ ఏడాది తెలుగులో “తెలుసు కదా” సినిమాలో కనిపించింది. తమిళంలో ఒక సినిమాలో నటించింది. ఈ రెండూ అలా వచ్చి ఇలా వెళ్లాయి. అంటే ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇక తాజాగా హిందీలో ఒకటి విడుదలైంది.
ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన “120 బహదూర్” చిత్రం నిన్న విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాశి ఖన్నా. మొదటి రోజు ఈ సినిమాకి 2 కోట్ల రూపాయల ఓపెనింగ్ వచ్చింది. మొదటి వీకండ్ పూర్తి అయ్యాక దీని ఫలితం ఏంటో తెలుస్తుంది.
గతేడాది “సబర్మతి రిపోర్ట్” తర్వాత ఆమె నటించిన హిందీ చిత్రం ఇది. ఈ ఏడాది మొత్తంగా మూడు సినిమాలు విడుదల చేసింది రాశి ఖన్నా. కానీ ట్రెండ్ ని బట్టి చూస్తే ఇది కూడా నిలబడేలా లేదు. సో, 2025లో మూడు సినిమాలు విడుదలైనా ఒక్కటీ హిట్ లేకుండానే క్యాలెండర్ ని ముగించేస్తోంది ఈ భామ.
ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్”పై ఈ భామ నమ్మకం పెట్టుకొంది. ఆ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.