నీరసం తెప్పిస్తున్న రాధాకృష్ణ

Radhe Shyam


‘రాధేశ్యామ్’కి ఇంతకుముందు చాలా హడావిడి చేశారు. కానీ అదంతా అయిపోయి చాలా కాలం అయింది. తమ సినిమా వస్తోందని జనానికి గుర్తు చెయ్యలంటే కొత్త ప్రొమోషన్ స్టార్ట్ చెయ్యాలి అని గ్రహించారు మేకర్స్.

ట్రైలర్ ఇప్పటికే వచ్చింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ పేరుతో కొంత కొత్త పుటేజ్ తో ఇంకో వీడియో రానుంది. మార్చి 2న ఈ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ మేకర్స్ చెప్పారు.

ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి ఇంకా హైప్ రావడం లేదు. ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. కానీ, రిలీజ్ ముందు ఉండే హైప్ మాత్రం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. బహుశా రిలీజ్ ట్రైలర్ తో అది వస్తుందేమో చూడాలి. వర్ధమాన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్తున్న మాటలు, ఇంటర్వ్యూ విశేషాలు మరీ నీరసం కలిగించేలా ఉన్నాయి. అభిమానులు ఎగ్జైట్ అయ్యే మాటలు కాకుండా ఫలానా జ్యోతిష్కుడి నుంచి ఇన్స్పైర్ అయ్యా, ఫలానా దర్శకుడితో కలిసి మొదట కథ రాసుకున్నా… అంటూ ఎదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అవేవి జనాలకు, అభిమానులకు ఉత్సాహపరిచేవి కావు.

మరి, హైప్ రావాలంటే ప్రభాస్ రంగంలోకి దిగాలి. ఈ రిలీజ్ ట్రైలర్ తర్వాత అది మొదలు అవుతుందని ఆశిద్దాం.

Advertisement
 

More

Related Stories