కలిసొచ్చిన దానితోనే ప్రయత్నం

Rajasekhar


యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కి రీమేక్ రాజా అనే పేరు కూడా ఉంది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలో నిజమైన రీమేక్ రాజాలు. అలాగే, రాజశేఖర్ చాలా రీమేక్ లు చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ లో నటిస్తున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్.

ఈ సినిమా ఒక థ్రిల్లర్. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ‘శేఖర్’ రూపొందుతోంది. ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లు. షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది.

రాజశేఖర్ కి ఇప్పుడు హిట్స్ కావాలి. ‘గరుడవేగ’ వల్ల వచ్చిన క్రేజ్ ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’తో హుష్ కాకి అయింది. అందుకే, ఈ సినిమా ఒప్పుకున్నారు. దీనిపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే, ఒరిజినల్ సినిమా కథలోనే ఆ దమ్ము ఉంది.

Advertisement
 

More

Related Stories