పెళ్ళికి ముందు పూజలు

- Advertisement -
Rakul Preet Singh

రకుల్ పెళ్లి ఫిక్స్ అయింది. వచ్చే నెల ఆమె పెళ్లి జరగనుంది. ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందుకే, ఆమె సడెన్ గా ఇప్పుడు గుడులు తిరుగుతోంది. పూజలు చేస్తోంది.

ఆమె కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి రీసెంట్ గా పూజలు చేసింది. ఆ ఫోటోలను జాకీ సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాదే వీరి పెళ్లి ఉంటుంది అనుకున్నారు. కానీ కాలేదు. దాంతో, వీరి బ్రేకప్ గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడూ మళ్ళీ పెళ్లి వార్తలు. వచ్చే నెల గోవాలో వీరి పెళ్లి జరుగుతుంది అని టాక్.

దానికి తగ్గట్లే పూజలు చేస్తోంది రకుల్. అలాగే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టింది. ఇంతకుముందు జాకీ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేందుకు ఆసక్తి చూపేది కాదు. కానీ ఇప్పుడు జంటగా దిగిన ఫోటోలను షేర్ చేస్తోంది. సో, పెళ్ళికి అంతా రెడీ అవుతోంది అన్నమాట.

More

Related Stories