2024లోనైనా ఛాన్సులు వచ్చేనా?

- Advertisement -
Krithi Shetty

తెలుగు సినిమారంగంలో హీరోయిన్లకు అతివృష్టి, అనావృష్టి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కొంచెం క్రేజ్ వస్తే చాలు ఆ హీరోయిన్ కి ఎగబడి ఛాన్సులు ఇస్తారు. వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాయా అస్సలు పట్టించుకోరు. రెండేళ్ల క్రితం నెంబర్ వన్ గా ఉన్న పూజ హెగ్డేకి ఇప్పుడు ఒక్క అవకాశం లేదు కదా. దాదాపు అలాంటి పరిస్థితిలోనే ఉంది కృతి శెట్టి.

ALSO CHECK: Krithi Shetty wishes Happy Sankranthi 2024

ఆమె గతేడాది శర్వానంద్ తో కలిసి నటించిన సినిమా ఇంకా విడుదల కావడం లేదు. పైగా ఇంతకుముందు ఆమె నటించిన నాలుగు, ఐదు సినిమాలు అపజయం చెందేసరికి ఆమెని పట్టించుకోవడం లేదు మేకర్స్. ఏడాది కాలంగా ఆమెకి ఒక్క అఫర్ లేదు.

శర్వానంద్ – కృతి శెట్టి సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల అవుతుంది. ఆ తర్వాత ఖాళీ అయిపోతుంది. అందుకే, ఇప్పుడు కనీసం ఒక్క ఛాన్స్ అయినా కావాలి అని అంటోంది.

2024లో కనీసం కొత్తగా రెండు సినిమాలు అయినా సైన్ చెయ్యాలని అనేది ఆమె టార్గెట్. ఆమె వయసు ఇప్పుడు 20 ఏళ్ళు మాత్రమే. 18 ఏళ్లకే “ఉప్పెన” సినిమాతో స్టార్డం వచ్చింది. రెండేళ్లలోనే పోయింది. అందుకే ఇప్పుడు కొత్త అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది.

More

Related Stories