- Advertisement -

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో 20 రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక తాజా కబురు ఏంటంటే ఆమె పెళ్ళికి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి..
ఆమె కుటుంబ సభ్యులు త్వరలో గోవాకి షిఫ్ట్ కానున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు. గోవాలోని ఒక రిసార్ట్ లో రకుల్ పెళ్లి జరుగనుంది. ఫిబ్రవరి 22న ఆమె పెళ్లి ముహూర్తం. పెళ్ళికి రెండు వారాల ముందే కుటుంబ మొత్తం గోవాకి వెళ్ళిపోతుందట.
రకుల్ నటిస్తున్న కొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నా అవి విడుదల కావడానికి చాలా టైం ఉంది. సో ఆమె పెళ్లి సంబరాలను ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు.
33 ఏళ్ల రకుల్ 39 ఏళ్ల జాకీ భగ్నానీని పెళ్లాడనుంది. చాలా కాలంగా వీరు డేటింగ్ లో ఉన్నారు.