
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా యూట్యూబ్ యాంకర్ అవతారం ఎత్తారు. ఆయనే ఇతరులను ఇంటర్వ్యూ చేస్తున్నారిప్పుడు. ఒకప్పుడు ఆయన ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానెల్స్, ఛానెల్స్ ప్రయత్నించేవి. ఇప్పుడు ఆయన సగటు యూట్యూబర్లా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇటీవల కీరవాణితో ముచ్చటించారు.
ఐతే, మిగతా సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు ఎలా ఉన్నా యంగ్ యాంకర్లతో ఆయన చిట్ చాట్ వేస్తే మాత్రం ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఆ భామల తొడలపైనే కెమెరా ఫిక్స్ అయ్యేలా చూసుకుంటారు.
తాజాగా ఆయన ఒక పోస్ట్ చేశారు తన ట్విట్టర్ లో. ఇందులో ఆయన ముఖం కనిపించదు. ఇంటర్వ్యూకి వచ్చిన భామ ముఖం కనిపించడం లేదు. కానీ ఫోకస్ మాత్రం ఆ భామ తొడలపైనే. అందుకే, ట్విట్టర్ లో “ఈ పిచ్చి తగ్గదా మీకు” అనే కామెంట్స్.
రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇవేవి పట్టించుకోరు. ఆయనకి ఇదొక ఎంజాయ్ మెంట్.