అండర్ వేర్ యాడ్ లో రష్మిక

- Advertisement -

రష్మిక బాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఆమె ఖాతాలో పెద్ద బ్రాండ్లు పడుతున్నాయి. తాజాగా ఒక యాడ్ లో నటించింది. ఇందులో ఆమెతో పాటు బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ నటించాడు.

“మాచో” అనే బ్రాండ్ కి చెందిన ఇన్నర్స్ (అండర్ వేర్) యాడ్ లో నటించింది. ఐతే, ఈ యాడ్ బయటికి వచ్చాక రష్మికకి ట్రోలింగ్ సెగ షురూ అయింది. ఎందుకంటే… ఈ యాడ్ తీసిన విధానం అలా ఉంది. విక్కి కౌశల్ అండర్ వేర్ స్ట్రాప్ చూసి ఆమె మోజుపడిపోయేలా ఆ యాడ్ లో ఉంది. అతను చేతులు పైకి అన్నప్పుడుల్లా డ్రాయర్ కనిపించడం, ఆమె ఇంప్రెస్ అయినట్లు చూపించారు. దాంతో డ్రాయర్ చూసి కూడా లవ్ లో పడుతారా అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

డబ్బుల కోసమే ఆమె యాడ్ లో నటించింది. కానీ అది మరీ ఈ రకంగా ఉండడంతో ఆమెకి విమర్శలు తప్పడం లేదు.

జాతీయస్థాయిలో ప్రమోట్ అయ్యే బ్రాండ్ ఒప్పుకుంటే తన గ్రాఫ్ పెరిగినట్లే అనేది ఆమె ఆలోచన. అందుకే , తనని తాను బాలీవుడ్ లో బాగా ప్రోమోట్ చేసుకుంటోంది రష్మిక. ఆమె ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోతో యాడ్ కూడా చెయ్యడం అంటే ఆమె పాపులారిటీ పెరిగినట్లే.

 

More

Related Stories