‘తమ’లో రష్మిక మందాన ఇలా

రష్మిక మందాన ఈ ఏడాది ఇప్పటికే “చావా”, “సికిందర్” వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగులో “కుబేర”లో నటించింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకి విడుదల తేదీ ఫిక్స్ అయింది.
రష్మిక మందాన నటించిన మరో భారీ బాలీవుడ్ చిత్రం.. తమ. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. ఇటీవల “స్త్రీ 2”, “చావా” వంటి సినిమాలు నిర్మించిన దినేష్ విజన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించిన ఆయుష్మాన్, రష్మిక పాత్రలకు సంబంధించి మొదటి పోస్టర్లను విడుదల చేశారు.
రష్మిక ఈ సినిమాలో తడాకా అనే పాత్ర పోషిస్తోంది. ఇక ఈ పోస్టర్లో రష్మిక వక్ష సంపద మరీ ఓవర్ గా చూపిస్తూ పోస్టర్ ని డిజైన్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
“తమ” దీపావళి కానుకగా అక్టోబర్లో విడుదల కానుంది. “తమ”తో పాటు “ది గర్ల్ ఫ్రెండ్” అనే మరో తెలుగు సినిమా కూడా ఈ రెండు నెలల్లోనే విడుదల కానుంది. మొత్తంగా రష్మిక ఈ ఏడాది 5 చిత్రాలు విడుదల చేస్తోంది.