రష్మిక IPL డ్యాన్స్ ఇదే!

Rashmika

రష్మిక మందాన మొదటిసారిగా ఐపీఎల్ లో డ్యాన్స్ చేసింది. తన డ్యాన్స్ చూడని వారికోసం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక కొత్త వీడియో పెట్టింది. ఐపీఎల్ లో చేసిన డ్యాన్స్ ఇదే అంటే ఆమె మళ్ళీ డ్యాన్స్ చేసి వీడియోని షేర్ చేసింది.

Advertisement

ఆమెతో పాటు తమన్నా కూడా ఐపీఎల్ ప్రారంభోత్సవ ఈవెంట్ లో డ్యాన్స్ చేసింది.

వీళ్ళు ఈ డ్యాన్స్ చేసినందుకు కోట్లల్లో పారితోషికం అందుకున్నారట. ఒక సినిమాలో నటిస్తే వచ్చే డబ్బు ఒక్క రోజు డ్యాన్స్ షోకి పొందినట్లు టాక్. ‘పుష్ప’, ‘వారసుడు’ చిత్రాల్లో రష్మిక చేసిన డ్యాన్స్ బాగా పాపులర్ అయింది. ఈ భామ ఇప్పుడు డ్యాన్స్, గ్లామర్ షోపై ఎక్కువ దృష్టి పెడుతోంది.

మరోవైపు, రష్మిక నటిస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ కి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాతో పాటు ఆమె నితిన్ సరసన కొత్త సినిమా సైన్ చేసింది.

Advertisement
 

More

Related Stories