ఒక్కసారి మొదలైతే ఆగేది లేదు!

Ram Charan

రామ్ చరణ్ గత రెండుళ్లుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “గేమ్ ఛేంజర్” సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నారు. దాంతో అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉంది. చరణ్ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అని బాధపడుతున్నారు. ఐతే వాళ్ళకి గుడ్ న్యూస్ ఉంది ఇప్పుడు.

రామ్ చరణ్ మరో సినిమాకి సంబంధించిన పనులు సైలెంట్ గా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒక్కసారి షూటింగ్ మొదలైతే స్పీడ్ గా పూర్తి చేసేలా అన్ని పనులు చేస్తున్నారు.

ఈ సినిమాకి దర్శకుడు బుచ్చిబాబు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. సినిమాలో ప్రధాన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తారు. హీరోయిన్ గా ఒక టాప్ హీరోయిన్ ని కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ డేట్స్ ని బట్టి తాను డేట్స్ ఇవ్వగలనా లేదా అనేది చెప్తాను అని ఆమె తెలిపింది. సో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాన్నిబట్టి ఆమె చేస్తుందా లేదా మరో హీరోయిన్ ని తీసుకుంటారా అనేది తేలుతుంది.

సినిమాటోగ్రాఫర్ ని ఫైనలైజ్ చేస్తే ఇంకా అసలు పనులు మొదలవుతాయి. 2025 వేసవిలో ఈ సినిమాని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

Advertisement
 

More

Related Stories