
“గుంటూరు కారం” విడుదలైంది. ఈ సినిమాకి ఇప్పటివరకు భారీ వసూళ్లు వచ్చాయి. టాక్ మిక్స్ డ్ గానే వచ్చింది. ఐతే, సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలు మొదటి రోజు నెగెటివ్ టాక్ వస్తే పూర్తిగా పడిపోతుంది. కానీ “గుంటూరు కారం”విషయంలో అలా జరగలేదు. ఈ పండుగ రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ గా కలెక్షన్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది మరో మూడు రోజుల తర్వాత తేలుతుంది.
ఇక ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాలి.
“అల వైకుంఠపురంలో” విడుదలైన వెంటనే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మరోసారి కలిసి సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. వీరి కాంబినేషన్ లో కొత్త సినిమా గురించి ఇటీవలే ప్రకటన వచ్చింది. ఈ ఏడాది చివర్లో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఐతే సరిగ్గా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంలో ఇప్పుడు క్లారిటీ లేదు.
కథ విషయంలో అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కువ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ ఒక పాయింట్ చెప్పినట్లు సమాచారం. ఐతే, “గుంటూరు కారం” తర్వాత త్రివిక్రమ్ కొంచెం ఆత్మరక్షణలో పడ్డట్లే. బలమైన స్క్రిప్ట్ లేకుండా హీరో మేనరిజం మీద, “అమ్మ” “కొడుకు” సెంటిమెంట్ తో మూవీస్ చేస్తే అన్నిసార్లూ జనం గొప్పగా ఆదరిస్తారని గ్యారెంటీ లేదు.”గుంటూరు కారం”తో ఆ విషయం త్రివిక్రమ్ అర్థమై ఉంటుంది.
ఆయన గొప్ప రైటర్. ముందు ఆయన బలం ప్రదర్శించాలి. అంటే కథల విషయంలో ఆయన ఎక్కువ ద్రుష్టి పెట్టి తీయాలి.
సో, ఈసారి బన్నీ సినిమా విషయంలో ఆయన అలక్ష్యం చేయకపోవచ్చు. ఎక్కువ గ్యాప్ తీసుకొని కొత్త సినిమా మొదలుపెట్టొచ్చు.