విస్కీ భామ అంటూ ట్రోలింగ్!

Regina


ఇన్ స్టాగ్రామ్ లో బ్రాండ్స్ ని ప్రోమోట్ చెయ్యడం ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా సెలెబ్రిటీలు వీటి వల్ల బాగా ఆదాయం పొందుతున్నారు. ఎంత ఎక్కువమంది ఫాలోవర్స్ ఉంటే అంత సంపాదన. సమంత వంటివారు ఇలా ఫుల్లుగా సంపాదిస్తున్నారు. ఐతే, ఏ బ్రాండ్ కి పడితే ఆ బ్రాండ్ కి ప్రొమోషన్ చేస్తే ట్రోలింగ్ తప్పదు.

రెజీనా ఇప్పుడు ఫుల్లుగా ట్రోలింగ్ కి గురి అవుతోంది అందుకే. ఆమె ఇటీవల సిగ్నేచర్ విస్కీ యాడ్ ని ప్రోమోట్ చేసింది తన ఇన్ స్టాగ్రామ్ లో. విస్కీ బ్రాండ్ ని ప్రోమోట్ చెయ్యడంతో ఆమె అభిమానులు, ఫాలోవర్స్ ఆమెని ఆడుకుంటున్నారు. డబ్బు కోసం విస్కీని ప్రోమోట్ చేస్తావా అంటూ ఏడిపిస్తున్నారు.

రెజినా ఒక్క కామెంట్ కి కూడా స్పందించడం లేదు. సైలెంట్ గా ఉంది. కొద్దీ రోజులు కామ్ గా ఉంటే జనం మర్చిపోతారు అనేది ఆమె ఉద్దేశం. డబ్బులు ఊరికే రావు కదా.

పైగా ఆమె పెద్ద బిజీ ఆర్టిస్ట్ కూడా కాదు. తెలుగులో ఆమె ప్రస్తుతం ఒక మూవీలో మాత్రమే నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories