నీ ఫిగర్ ఇష్టం… అరియనాతో ఆర్జీవీ

RGV and Ariyana


‘బిగ్ బాస్ 4’లో పాల్గొన్న అరియనా ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోని, అరియానాని వర్మ తెగ ప్రమోట్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం కదా! వర్మ ఇంతగా స్పెషల్ ‘ఇంట్రెస్టు’ తీసుకునేసరికి నేచురల్ గానే అందరికి కలగాల్సిన అనుమానాలే కలిగినట్లున్నాయి.

“సార్… మీరు నా గురించి ట్వీట్ చేసినప్పటి నుంచి బయట రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మన ఇద్దరి మధ్య ఎదో ఎఫైర్ ఉందని అనుకుంటున్నారు…,” అని ఈ అమ్మడు అమాయకంగా ఫేస్ పెడుతూ ఒక క్వెశ్చన్ వేసింది. దానికి వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

“ఈ అమ్మాయి, ఆ అబ్బాయి అలా అని … వీడు అలాంటోడు, ఆమె అలాంటిది అంటూ మాట్లాడకపోతే సోషల్ మీడియా వాళ్లకు నిద్ర పట్టదు. వాటిని పట్టించుకోవద్దు. మనం చెయ్యాల్సింది మనం చేసుకుంటూ పోదాం,” అంటూ హితబోధ చేశారు.

అలాగే, అరియనా అందం గురించి వర్మ చేసిన కామెంట్ వల్లే ఆమెకి బిగ్ బాస్ లో చోటు దక్కింది. దాంతో అరియనా థాంక్స్ చెప్పింది. కానీ వర్మ దానికి క్రెడిట్ తీసుకోదల్చుకోలేదు. “నీ ఫిగర్, నీ అందం ఇష్టం నాకు. అందుకే కామెంట్ చేశా,” అని 59 ఎళ్ల రామ్ గోపాల్ వర్మ 20+ అరియానాతో అన్నారు.

Ariyana

రామ్ గోపాల్ వర్మ, అరియనా జిమ్ లో ఎక్సర్ సైజులు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. ఇదంతా యూట్యూబ్ వ్యూస్ కోసమే అని అర్థమవుతోంది.

Advertisement
 

More

Related Stories