ఆర్ఆర్ఆర్ లో ఫైట్స్ చూస్తే…!

RRR Climax Shoot

రాజమౌళి తీస్తున్న “ఆర్ఆర్ఆర్”లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫైట్ సీన్స్ నభూతో అన్నట్లు ఉంటాయని ఇటీవల ఎన్టీఆర్ ఒక హాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి సినిమాల్లో ఇప్పటివరకు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఈసారి కళ్ళు చెదిరే ఫైట్స్ గురించి మాట్లాడుకుంటారట.

ఈ ఫైట్స్ గురించి రాజమౌళి తండ్రి, సినిమా రైటర్ కూడా అదే మాట అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట: “ఈ సినిమాలో ఫైట్స్ చూస్తే విజిల్ వెయ్యాలనిపించదు. కసి పెరుగుతుంది. ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం. నేను ఎడిట్ అయిన ఫైట్ సీన్స్ చూశాను. నాకు కన్నీళ్లు వచ్చాయి. అంత ఎమోషన్ ఉంది. రాజమౌళి చాలా గొప్పగా తీశాడు.”

ఎమోషన్ పండించడంలో రాజమౌళి కింగ్. మరి ఈసారి యాక్షన్ సీన్లు చూస్తే గుండె బరువెక్కేలా ఉంటుంది అనడంతో ఆసక్తి పెరుగుతుంది… రాజమౌళి ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడో అని.

“ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారు.

Advertisement
 

More

Related Stories