RRR నేనింకా చూడలేదు: చరణ్

TeluguCinema 19 Sep 2021
ramcharan magician bb


రామ్ చరణ్ ఇంకా RRR సినిమాని పూర్తిగా చూడలేదట. “డబ్బింగ్ చెప్పాను. కానీ నేను డబ్బింగ్ చెప్తున్న సీన్లు మాత్రమే చూపించారు రాజమౌళి. సినిమా కానీ, పాటలు కానీ ఇంతవరకు చూపించలేదు,” అని రామ్ చరణ్ చెప్పాడు. ‘బిగ్ బాస్ 5’ షోకి గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు ‘ఆర్ ఆర్ ఆర్’లో. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. చరణ్ సరసన అలియా భట్ నటించింది.

రాజమౌళి తాను విజన్ కి తగ్గట్లు సినిమా తీస్తూ పోతారు. ఆ తర్వాత ఎడిటింగ్, గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ అవుతాయి. అవన్నీ అయ్యాకే చూస్తేనే రాజమౌళి పూర్తి మ్యాజిక్ అర్థం అవుతుంది. అందుకే, ఆ టాప్ డైరెక్టర్ తన సినిమాల విజువల్స్ ని గ్రాఫిక్స్ పూర్తి అయ్యాకే చూపిస్తారు.

రామ్ చరణ్ ఇప్పటికే జక్కన్న డైరెక్షన్ లో ‘మగధీర’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు.

రామ్ చరణ్ ఈ మూవీతో పాటు శంకర్ కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ‘ఆచార్య’లో అతిధి పాత్రలో కనిపిస్తాడు.