రుక్మిణి: అంతా దాని చలవే!

రుక్మిణి వసంత్ ఒక్కసారిగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ్ లో భారీ సినిమాలు సైన్ చేసింది. మాతృ పరిశ్రమ కన్నడ సీమలో కన్నా ఇతర భాషల్లో పెద్ద సినిమాల ఆఫర్లు లాగేసుకుంటోంది.
ఈ వీకెండ్ ఆమె మనల్ని తమిళ చిత్రం “మదరాసీ”తో పలకరిస్తోంది. ఆ తర్వాత “కాంతార 1″తో అలరిస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సరసన “డ్రాగన్” చిత్రంలో నటిస్తోంది. అలాగే కన్నడ భారీ చిత్రం “టాక్సిక్”లో కూడా నటిస్తోంది. నాని, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కొత్త చిత్రాల్లో కూడా ఈ భామ పేరు పరిశీలనలో ఉంది.
ఇంత క్రేజ్ రావడానికి కారణం… సప్త సాగరదాచే ఎల్లో’ (Sapta Saagaradaache Ello) అనే కన్నడ చిత్రంలో ఆమె అందం, అభినయం కారణం. ఆ సినిమాతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇలా వరుసగా భారీ మూవీస్ అందుకుంటోంది.
ALSO READ: Rukmini Vasanth’s dream run with Pan-Indian biggies
ఈ సినిమా విడుదలై రెండేళ్లు. ఈ సందర్భంగా ఈ భామ తన అభిమానులకు, ఆ సినిమా తీసిన టీంకి కృతఙ్ఞతలు తెలిపింది. ఇదంతా ఆ సినిమా చలవే అని పేర్కొంది. “సినిమా ప్రపంచంలో ఒక మూలన నాకు కూడా ఒక చోటు ఇచ్చిన ప్రేక్షకులకు, ఈ సినిమాకి సదా రుణపడి ఉంటాను,” అని రాసింది తన ఇన్ స్టాగ్రామ్ లో.