సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు?

Sai Pallavi

2021ని సాయి పల్లవి అందంగా ముగించింది. ఆమె నటించిన రెండు సినిమాలు మూడు నెలల గ్యాప్ లో వచ్చాయి. ఒకటి లవ్ స్టోరీ. రెండోది ‘శ్యామ్ సింగ రాయ్’. నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో రోజిగా అదరగొట్టింది సాయి పల్లవి. 2022లో ఏ సినిమాలు చెయ్యనుంది? ఇంకా మరో తెలుగు సినిమా ఇంకా సైన్ చెయ్యలేదు.

దాంతో, పెళ్లి ఆలోచన చేస్తుందేమో అన్న డౌట్ వస్తోంది. తన నటనతో అందరిని ఫిదా చేసిన ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెట్టింది. 30 దాటిన తరువాత చేసుకుంటాను అని చెప్పింది. ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నది పెళ్లి కోసం కాదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఆమెకి 29 ఏళ్ళు. అంటే ఇంకో ఏడాది తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తుందట. ఆమె చెల్లెలు కూడా ఇటీవలే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. సో, సిస్టర్ హీరోయిన్ గా సెటిల్ అయిన వెంటనే ఆమె పెళ్లి ఫ్రేమ్ లోకి అడుగుపెడుతుందన్నమాట.

మరోవైపు, సాయి పల్లవి రానా సరసన నటించిన ‘విరాట పర్వం’ కొత్త ఏడాదిలో విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories