మూడు వారాలకే ఓటిటిలోకి

Saindhav

వెంకటేష్ నటించిన “సైంధవ్” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయింది. సినిమా దారుణంగా పరాజయం పాలైంది. ఇక ఇప్పుడు ఓటిటిలోకి వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

థియేటర్లో విడుదలకు, ఓటిటిలో విడుదలకు మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండాలి అని తెలుగు చిత్ర నిర్మాతలే నిబంధన పెట్టుకున్నారు. వాళ్ళే ఆ నిబంధనని పక్కన పడేస్తున్నారు. ఈ సినిమా కేవలం 22 రోజుల్లోనే (అంటే మూడు వారాలకే) ఓటిటిలోకి వచ్చేస్తోంది.

ఇంతకుముందు “సలార్” విషయంలో కూడా అదే జరిగింది. ఒక సినిమా థియేటర్లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కనీసం నాలుగు వారాల గ్యాప్ కూడా లేకుంటే థియేటర్ వ్యవస్థ బతకదు అని సినిమా నిర్మాతలే ఆ మధ్య మొత్తుకున్నారు. ఇప్పుడు థియేటర్ల కలెక్షన్లు కాస్త గాడిలో పడేసరికి మళ్ళీ కథ మొదటికి.

Advertisement
 

More

Related Stories