ఇక పెళ్లి ఒక్కటే బాకీ!

TeluguCinema 07 Nov 2025
Samantha and Raj Nidimoru

సమంత, ఆమె ప్రియుడు రాజ్ నిడిమోరు ఇప్పుడు పూర్తిగా బయటికి వచ్చేశారు. ఇక తమ బంధం గురించి వాళ్ళు ఏమి దాచుకోవడం లేదు. తాము జంట అని అధికారికంగా ఈ రోజు సమంత ప్రకటించినట్లైంది. ఆమె ఈ రోజు పై ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ ఫోటోతో వారి బంధం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరు ఇద్దరూ రిలేషన్లో ఉన్నారు అని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇంతకుముందు కూడా సమంత రాజ్ నిడిమోరుతో సెల్ఫీలు, ఫోటోలు షేర్ చేసింది. కానీ తాజాగా షేర్ చేసిన ఫోటో ప్రత్యేకం. ఇక తమ గురించి ఆమె అధికారికంగా చెప్పినట్లు.

ALSO READ: Photo moment: Samantha hugs live-in partner Raj Nidimoru

సమంత హీరో నాగ చైతన్యని పెళ్ళాడి, నాలుగేళ్ళ తర్వాత విడిపోయింది. నాగ చైతన్య మరో హీరోయిన్ శోభితని ప్రేమించి గతేడాది పెళ్లి చేసుకున్నాడు. చైతన్య పెళ్లి చేసుకున్న మూడు నెలల తర్వాత సమంత రాజ్ నిడిమోరుతో మొదటిసారిగా పబ్లిక్ గా కనిపించింది. ఇక ఇప్పుడు ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.

రాజ్ నిడిమోరు “ది ఫ్యామిలీ మేన్” వంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు డైరెక్ట్ చేశారు. అతను కూడా భార్య నుంచి విడిపోయాడు. ఐతే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.

ఇటీవలే కొత్త ఇంట్లోకి మాత్రం అడుగుపెట్టింది ఈ జంట. అలా సహజీవనం చేస్తోంది సమంత, రాజ్ జంట.