సమంత, రాజ్… కారులో షికారు!

సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అనేక చోట్లా జంటగా కనిపించారు. మొదట్లో ఇద్దరూ ఒకే చోటా కెమెరా ముందుకి వచ్చేందుకు ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఒకే కారులో షికార్లు చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ కి కలిసి వస్తున్నారు. ఫొటోగ్రాఫర్లు, విడియోగ్రాఫర్లు వారిని తమ కెమెరాల్లో బంధిస్తున్నా నో చెప్పడం లేదు.
తాజాగా ముంబైలో ఒక ఈవెంట్ కి చెట్టాపట్టాలేసుకొని వచ్చి, వెళ్లారు. తిరిగి వెళ్తుండగా మీడియాని పలకరించి మరీ వెళ్లారు.
సమంత భర్త నుంచి విడిపోయింది. రాజ్ నిడిమోరు కూడా భార్యకి విడాకులు ఇచ్చాడు. ఇద్దరూ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నారు అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
సమంతని మొదట “ది ఫ్యామిలీమేన్ 2” వెబ్ సిరీస్ లో డైరెక్ట్ చేశాడు రాజ్ నిడిమోరు. అక్కడ వీరి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నాగ చైతన్యతో విడిపోయాక డేటింగ్ మొదలుట్టింది. రాజ్ నిడిమోరు ప్రస్తుతం ఆమెతో “రక్త్ బ్రహ్మాండ” అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు.