సిద్ధుతో సినిమా చేస్తుందా?

సమంత ఇప్పుడు పెద్దగా బిజీగా ఏమీ లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత ఇంటరెస్టింగ్ పాత్ర చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉంది. మరోవైపు హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఈ రెండూ రెండు నెలల్లో పూర్తి అవుతాయి. ఆ తర్వాత ఆమె ఏమి చేస్తుంది?

రీసెంట్ గా ఆమెకి సిద్దూ జొన్నలగడ్డ సరసన నటించే ఆఫర్ వచ్చినట్లు టాక్. ‘డీజే టిల్లు’ సినిమాతో సిద్ధూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు యువ హీరోలలో అతనికి మంచి క్రేజ్ ఉంది. సో, సిద్ధూతో సినిమాలు చేసేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. సమంతకి మంచి ఫ్రెండ్ అయిన ఒక మహిళ దర్శకురాలు సిద్ధూతో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంతని తీసుకోవాలి అనేది ఆమె ప్లాన్.

మరి, ఆమె ప్లాన్ వర్కవుట్ అవుతుందా? సమంత సై అంటుందా?

Advertisement
 

More

Related Stories