సమంత… కసి, కృషి, రుషి!

- Advertisement -
Samanthakasikrishi

హీరోయిన్ సమంత భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్లాలని కసిగా ఉందనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే సక్సెస్ అయినట్లే. ఆమె చేసిన ఐటెం సాంగ్ “ఊ ఊహు అంటావా మావా” అనే పాట ఇప్పటికే గ్లోబల్ ఛార్ట్స్ లోకి వచ్చింది. ఇండియా అంతా ఊపేస్తోంది.

ఇక హీరోయిన్ గా పెద్ద ఆఫర్లు కొట్టేలా ఆమె కృషి ఉంది. ఆమె హీరోయిన్ గా ఒక పెద్ద బాలీవుడ్ చిత్రం త్వరలోనే రూపొందనుంది. దానికి సంబంధించిన ప్రకటన రానుందట.

మరోవైపు, ఆమె ఆధ్యాత్మిక బాట కూడా పట్టింది. అటు కెరియర్ లో కసిగా పనిచేస్తూనే… స్పిరిచువల్ గా కూడా అంతే శ్రద్ధతో ఉందట. తాజాగా ఆమె ఋషుల వలె ఒక సరస్సులో ఉన్న రాయిపై కూర్చొని తపస్సు చేసింది. “నీ ఉనికిలోని అసలైన అర్థం ఏంటో తెలుసుకోవడం ధ్యానం సాధ్యం,” అంటూ సద్గురు కొటేషన్ కూడా పెట్టింది.

సమంత తనదైన జీవనశైలిని ఏర్పరుచుకున్నారు.

More

Related Stories