ఒకసారి వీక్, ఇంకోసారి పీక్!

TeluguCinema 22 Nov 2025
Samantha fitness

సమంత ఆ మధ్య అనారోగ్యం కారణంగా తాను ఎంత వీక్ అయిందో చెపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేది. బాగా లావు తగ్గి కూడా కనిపించింది. ఆమెకున్న మయోసిటిస్ ఫిజికల్ కండిషన్ ని చూసి అందరూ ఆమె సోషల్ మీడియా పోస్టులను అర్థం చేసుకున్నారు. ఆమె హెల్త్ పోస్టులను చూసిన వారంతా సానుభూతి చూపి, ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేస్తుండేవారు.

ఇక ఆమె తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది ఇన్ స్టాగ్రామ్ లో. ఈ ఫోటో చూస్తే ఆమె ఎంత సంపూర్ణ ఆరోగ్యంగా ఉందో అర్థం అవుతోంది. జిమ్, మంచి లైఫ్ స్టయిల్ తో ఆమె పూర్తిగా కోలుకున్నారు అనిపిస్తోంది.

ఆమె ఫుల్లుగా మజిల్ పెంచారు. తన వీపు భాగంలో పెరిగిన కండ బలం చూపుతూ పోస్టు పెట్టారు. అందరూ స్ట్రెంగ్త్ ఎక్సర్ సైజులు చెయ్యాలని ఆమె సందేశం కూడా ఇచ్చారు. ఈ ఫోటో చూస్తే ఆమె ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఆమె వీక్ నెస్ గురించి చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఫిట్నెస్ పరంగా ఆమె పీక్ లో ఉంది.

సో, ఆమె ఇక ఫుల్లుగా సినిమాలు చెయ్యొచ్చు. మరిన్ని సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె “మా ఇంటి బంగారం” అనే సినిమాలో నటిస్తోంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ జురుగుతోంది. రవితేజ హీరోగా రూపొందే ఒక కొత్త సినిమాలో కూడా ఆమెని అడిగారు.

ఇక వ్యక్తిగత జీవితం కూడా గాడిన పడింది. ఆమె ప్రస్తుతం దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఉంటున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. తమ బంధాన్ని వారిప్పుడు దాచుకోవడం లేదు కూడా.