సినిమాలు నిల్… ఆదాయం ఫుల్

స్టార్ డమ్ వచ్చిన తర్వాత, భారీ క్రేజ్ తో ఒక దశకు చేరుకున్న తర్వాత కేవలం సినిమాలతోనే ఆదాయం ఆశించనక్కర్లేదు. క్రేజ్ కు తగ్గట్టు ఎన్నో యాడ్స్, మరెన్నో బ్రాండింగ్స్ వస్తూనే ఉంటాయి. వీటికితోడు వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం సమంత ఈ స్టేజ్ లోనే ఉంది.

ఇప్పటివరకు తన కొత్త సినిమాను స్టార్ చేయలేదు సమంత. ఆమె సెట్స్ పైకొచ్చి దాదాపు 8 నెలలు కావొస్తోంది. అయితేనేం సమంత ఆదాయానికొచ్చిన ఢోకా ఏం లేదు. ఆమె వరుసగా యాడ్స్ చేస్తోంది. మింత్రా యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. మంచ్ యాడ్ చేసింది. వన్ ప్లస్ మొబైల్స్ కు ప్రచారం చేస్తోంది.

అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్రాండ్ కి సంబంధించి పోస్ట్ పెడితే… లక్షలు తీసుకుంటుంది.

ఇవి కాకుండా ఏకంగా సాకి పేరిట ఏకంగా డిజైనర్ స్టోర్ నే లాంఛ్ చేసింది. సో.. సమంత ఆదాయానికొచ్చి ఇబ్బందేం లేదు. ఇంకా చెప్పాలంటే ఓ వాషింగ్ పౌడర్ కు ప్రచారం కల్పిస్తూ, లాక్ డౌన్ టైమ్ లో కూడా ఇళ్లు కదలకుండా సంపాదించింది సమంత.

Advertisement
 

More

Related Stories