
సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. ‘ఏమాయ చేసావే’, ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘ఈగ’, ‘ఓ బేబీ’, ‘మజిలీ’… ఇలా ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి ఆమె ఖాతాలో. ఆమె నటిగా మెప్పించిన పాత్రలు కూడా అనేకం. కానీ, ఇప్పుడు అవన్నీ జనం మర్చిపోయారట.
ఇప్పుడు సమంత అంటే.. .. “ఊ అంటావా మావా” అని ఫిక్స్ చేశారట. జనంలో ఈ పాట బాగా పాపులర్ కావడం, ముఖ్యంగా నార్త్ ఇండియాలో తనని అందరూ ఈ పాటలో నటించిన భామగానే గురుతుపడుతున్నారు అని గొప్పగా చెప్తోంది. ఐతే, ఆమెని హీరోయిన్ ని నుంచి ఐటెం గాళ్ కి తీసుకొచ్చారు అని మాత్రం అనుకోవడం లేదు. ఈ పాటతో తనకి ఇప్పుడు ఇంకా పాపులారిటీ పెరిగిందని మురిసిపోతోంది.
“ఎన్నో గొప్ప పాత్రలు, సినిమాలు చేశాను. కానీ ఈ పాట మాత్రం అందరి మైండ్ లో ఫిక్స్ అయిపొయింది,” అని అంటోంది. అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సినిమాలో ఆమె ఈ ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట బాగా వైరల్ అయింది. నాగ చైతన్యతో విడిపోయాక, ఈ పాట చెయ్యడం అది బాగా పాపులర్ కావడంతో ఆమెకి ఈ కొత్త గుర్తింపు ఆనందాన్ని ఇస్తోంది.
లేటెస్ట్ గా ఆమె ఫోటోషూట్ లు కూడా ఇలా గ్లామర్ తోనే నింపేస్తోంది.