సమంత ఇదంతా అవసరమా?

- Advertisement -
Samantha


హీరోలు, హీరోయిన్లు నిజ జీవితంలో ఎక్కువగా బూతులు మాట్లాడుతుంటారు. “ఎఫ్” వర్డ్స్ లేకుండా సెంటెన్స్ పూర్తి చెయ్యలేరు చాలామంది హీరోలు, హీరోయిన్లు. అది కెమెరా వెనుక వ్యవహారం. ఐతే, పబ్లిక్ గా వచ్చినప్పుడు అందరూ డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. సమంత లేటెస్ట్ గా ధరించిన ఒక టీ షర్ట్ ని చూస్తే ఆమె డీసెన్సీని మర్చిపోయినట్లు కనిపిస్తోంది.

ఆమె టీ షర్ట్ పై బూతుల దండకం ఉంది. అలాంటి టీ షర్ట్ ధరించి ఆమె బైటికి రావడం, హ్యాపీగా కెమెరాలకు ఫోజు ఇవ్వడం చూస్తేంటే… ఆమె కావాలనే ఎవరికో ఒక సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. కానీ, అంత పెద్ద హీరోయిన్ అలాంటి బూతు స్లోగన్ లతో కూడిన టీ షర్ట్ ధరించి ఫోజులు ఇవ్వడం సంస్కారమేనా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

సినిమాల్లో “ఊ అంటావో ఊఊ అంటావో” కానీ జనాల్లోకి వచ్చినప్పుడు కొంచెం మర్యాద పాటించండి అని అంటున్నారు నెటిజెన్లు. కానీ సమంత అవన్నీ పట్టించుకుంటుందా?

ఈ ఏడాది సమంత నుంచి “యశోద”, “శాకుంతలం” వంటి సినిమాలు విడుదలవుతాయి.

 

More

Related Stories