Sara Rajun: మొదటి సినిమాతో భారీ హిట్

TeluguCinema Team 11 Dec 2025
Sara Arjun

సారా అర్జున్ బాలనటిగా బాగా పరిచయం. ఆ తర్వాత టీనేజర్ గా “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా నటించి మరింత పాపులర్ అయింది. ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం అయి మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది సారా అర్జున్.

ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా ఆడుతున్న చిత్రం.. “ధురంధర్.” రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ వీకెండ్ కి ఇండియాలో 200 కోట్ల క్లబ్బులో చేరనుంది/ సులువుగానే 300 కోట్లు కొల్లగొడుతుందని అంచనా ఉంది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఇంత పెద్ద హిట్ అందుకున్న సారా అర్జున్ కి అవకాశాలు ఫుల్లుగా వస్తాయని భావిస్తున్నారు.

ఈ అందాల భామకి ప్రస్తుతం 20 ఏళ్లే. ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసి పెద్ద హీరో రణ్వీర్ సింగ్ సరసన నటించింది. మొదటి సినిమాతోనే అన్నీ సెట్ అయ్యాయి. మొదట తనకన్నా 20 ఏళ్ళు వయసులో పెద్ద అయిన రణ్వీర్ సరసన నటించడం గురించి విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ పట్టించుకోలేదు ఈ భామ. ఆమె సినిమాని సినిమాగానే చూసింది, భారీ విజయం అందుకొంది.

తెలుగులో రెండు సినిమాలు

ఈ భామ హీరోయిన్ గా కాకముందే అంటే రెండేళ్ల క్రితం తెలుగులో రెండు సినిమాలు చేసింది. అవి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో, ఈ సినిమాలకు మరింత క్రేజ్ రావొచ్చు. అవేంటంటే… గుణశేఖర్ తీసిన “యుఫొరియా”, గౌతమ్ తిన్ననూరి తీసిన “మేజిక్”.

Sara Arjun

ఇక హీరోయిన్ గా ఈ భామకి బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉంది. “ధురంధర్ 2” కూడా రానుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News