మలయాళ భామలకు సూర్య ఓటు

TeluguCinema 11 Dec 2025
Suriya, Nazhriya Fahadh and Mamitha Baiju,

తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన సూర్య కెరీర్ ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. అతనికి సరైన హిట్ పడి పదేళ్ల పైనే అవుతోంది. ఇటీవల విడుదల చేసిన “కంగువ”, “రెట్రో” సినిమాలు పరాజయం అతనికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దాంతో ప్రస్తుతం తెలుగు, మలయాళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు.

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీస్తున్న కొత్త చిత్రం (Suriya 46) షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్. ఈ భామ ఇటీవల “డ్యూడ్” సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ భామ కేరళకుట్టి.

ఇక ఇటీవల ఒక మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తో ఒక సినిమా (Suriya 47) మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నజ్రియా తెలుగులో నాని సరసన “అంటే సుందరానికి” సినిమాలో నటించింది. ఆమె భర్త ఫహద్ ఫాజిల్ చాలా పాపులర్ నటుడు. తెలుగులో పుష్ప సినిమాలో నటించాడు. ఈ భామ ఇప్పుడు సూర్య సరసన నటిస్తోంది.

సూర్య ఇలా వరుసగా తన రెండు సినిమాల్లో ఇద్దరి మలయాళీ భామలకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం కొంత సర్ప్రైజ్ కలిగిస్తోంది.