చీరలంటే మోజు: అనుపమ

TeluguCinema 05 Apr 2022
anupama stills 050422 001


హీరోయిన్ అనుపమకి చీరలు అంటే తెగ మోజంట. చీర కట్టడం ఒక కళ అని కూడా చెప్తోంది. అనుపమ ఇటీవల ఎక్కువగా చీరకట్టుడులోనే ఫోటోషూట్లు చేస్తోంది. ఇండియన్ డ్రెస్సింగ్ లలో చీర ది బెస్ట్ అని చెప్తోంది ఈ భామ.

సడెన్ గా ఆమె చీర కట్టుడు గురించి లెక్చర్లు ఇస్తోందంటే మేటర్ వేరు అనుకుంటున్నారా? అలాంటిదేమి లేదు. ఆమె పెళ్లి ఆలోచనలో లేదు లెండి. ఆమెకింకా 25 ఏళ్లే. కెరియర్ మీదే దృష్టి నిలిపింది.

ALSO CHECK: Anupama Parameswaran in a silk Saree

ఇటీవలే ఆమె బోల్డ్ గా నటించడం కూడా మొదలు పెట్టింది.