టైటిల్ సీక్రెట్ చెప్పిన రాజశేఖర్!

Sekhar

రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా శేఖర్. 20వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు శేఖర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అసలు ఈ టైటిల్ రాజశేఖర్ కు నచ్చిందా లేక తన పేరు ఉందని ఓకే చెప్పాడా? వీటన్నింటిపై రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. శేఖర్ అనే టైటిల్ ను తను తిరస్కరించినట్టు వెల్లడించారు.

“శేఖర్ టైటిల్ పెట్టినప్పుడు నేను వ్యతిరేకించాను. మరీ సాఫ్ట్ గా ఉందని అభ్యంతరం చెప్పాను. జీవిత, పిల్లలు మాత్రం ఒప్పుకోలేదు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పుడే ప్రేక్షకులు అంచనాల్లేకుండా థియేటర్లకు వస్తారని చెప్పారు. అలా
థియేటర్లకు వచ్చే ప్రతి ఆడియన్ కు సినిమా నచ్చుతుందన్నారు. బలమైన, మాస్ టైటిల్ పెడితే మా సినిమాకు మైనస్ అవుతుందని అన్నారు. అలా శేఖర్ అనే టైటిల్ ఫిక్స్ అయింది.”

ఇలా శేఖర్ సినిమా టైటిల్ వెనక సీక్రెట్ బయటపెట్టారు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ అనే సినిమాకు రీమేక్ ఇది. మరి ఈ ప్రాజెక్టులోకి రాజశేఖర్ ఎలా వచ్చారు? ఎందుకు ఒప్పుకున్నారు?

“ఓసారి తమ్మారెడ్డి భరధ్వాజ్ గారు కలిసి మలయాళం సినిమా చూడమన్నారు. అది చేస్తే బాగుంటుందన్నారు. ఒరిజినల్ మూవీని అందరం కలిసి చూశాం. జీవిత, పిల్లలు కూడా ఉన్నారు. డిఫరెంట్ గా ఉందనిపించింది. బాగా నచ్చింది. నేను చేస్తానని జీవితకు చెప్పాను. అంతవరకే నా పని. మిగతా పనంతా జీవితానే చూసుకుంది. ప్రొడక్షన్ నుంచి డైరక్షన్ వరకు అంతా ఆమెనే.”

శేఖర్ సినిమా తన కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు రాజశేఖర్. ఈ సినిమా క్లయిమాక్స్ నెగెటివ్ ఎండ్ ఉండదని, ఈ సినిమాకు అది కరెక్ట్ ఎండ్ అవుతుందని అన్నారు.

 

More

Related Stories