తమన్న, మెహ్రీన్ నా పిల్లలే

Pragati

ఎఫ్2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు తల్లిగా నటించింది ప్రగతి. సీక్వెల్ కాబట్టి ‘ఎఫ్3’లో కూడా ఆమెనే తల్లిగా నటించింది. అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో నిజజీవితంలో కూడా తను వాళ్లిద్దరికీ తల్లిగా మారిపోయానంటోంది ఈ సీనియర్ నటి. బయట తమన్న, మెహ్రీన్ ను చూస్తుంటే తన బిడ్డల్ని చూస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

ఎఫ్2, ఎఫ్3ది దాదాపు నాలుగేళ్ల ప్రయాణం. ఈ నాలుగేళ్ల జర్నీలో ప్రగతిని తల్లిగానే చూసుకున్నారట తమన్న, మెహ్రీన్. సెట్స్ లో ఏ అవసరం ఉన్నా వెళ్లి ప్రగతినే అడిగేవారంట. తమ సమస్యల్ని ప్రగతితోనే చెప్పుకునేవారంట. సినిమా షూటింగ్స్ లేనప్పుడు బయట తరచుగా కలుసుకునేవారంట. అలా తమన్న, మెహ్రీన్ తనకు పిల్లలు అయిపోయారని అంటోంది ప్రగతి.

ఇక తమన్న, మెహ్రీన్ మధ్య తేడా చెబుతూ.. క్లాసులో స్టూడెంట్ లా తమన్న బుద్ధిగా ఉంటుందని, మెహ్రీన్ మాత్రం థియేటర్లో కుర్రాడిలా అల్లరి చేస్తుందని చెప్పుకొచ్చింది. సెట్స్ లో మెహ్రీన్ వాగుతూనే ఉంటుందని, తమన్న మాత్రం
సైలెంట్ గా ఉంటుందని అంటోంది.

ఎఫ్3 సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎంతోమందిని మిస్సయ్యానని… కానీ తమన్న, మెహ్రీన్ ను మిస్సయినప్పుడు మాత్రం చాలా బాధేసిందని అంటోంది ప్రగతి. ఎఫ్4 కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపింది.

 

More

Related Stories