నాకేమి పెద్ద కోరికల్లేవు: శ్రద్ధ

TeluguCinema 06 Oct 2025
Shraddha Srinath

హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ చాలా సినిమాలల్లో కనిపిస్తుంటుంది. అయినా ఆమెకి పెద్దగా క్రేజ్ రాలేదు. జనంలో కూడా పాపులారిటీ ఎక్కువగా లేదు.

శ్రద్ధ శ్రీనాథ్ తాజాగా నెట్ ఫ్లిక్స్ కోసం “ది గేమ్” అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అనేక విషయాలు మాట్లాడింది. తన కెరీర్ గురించి చెప్తూ… తనకి కెరీర్ విషయంలో పెద్ద కోరికలు, పెద్ద డ్రీమ్స్ వంటివి లేవు అని చెప్పింది.

“ఇలాంటి సినిమాలు చెయ్యాలి. ఏడాదికి ఎన్ని సినిమాలు ఒప్పుకోవాలి. ఎక్కువ సినిమాల్లో కనిపించాలి… ఇలాంటి ప్లాన్స్ లేవు. నా చేతికి వచ్చినవి చేస్తాను. నాకు నచ్చినవి, నాకు కంఫర్ట్ గా అనిపించినవి చేస్తాను,” అని పేర్కొంది.

కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. మరికొన్ని సినిమాల్లో విలన్ గానూ దర్శనమిస్తుంది. అలాగే మరికొన్ని సినిమాల్లో విలన్ కి భార్యగా కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి వెబ్ సిరీసులు కూడా చేస్తోంది. అదే ఆమె స్టయిల్.