బికినీ షో, ముద్దుల హంగామా!


హీరోయిన్ శ్రద్ధ కపూర్ హంగామా ఇటీవల కొంత తగ్గింది. ‘సాహో’ విడుదల టైంలో ఆమె హడావిడి కొంచెం ఎక్కువే కనిపించింది. “స్త్రీ”, “చిచోరే” వంటి హిట్ సినిమాలతో అప్పుడు మంచి ఊపులో ఉంది. ఐతే, “సాహో” ఫెయిల్ కావడం, ఆ తర్వాత వచ్చిన “భాగీ 3” ఆడకపోవడంతో ఆమెకి గ్యాప్ వచ్చింది.

దాదాపు రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మరోసారి ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆమె నటించిన కొత్త చిత్రం… తు జుటి మై మక్కర్ (Tu Jhoothi Main Makkaar). రణబీర్ కపూర్ హీరో. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ట్రైలర్ చూస్తే ఈ అమ్మడు అందచందాల ప్రదర్శనలో రెచ్చిపోయింది అనిపిస్తోంది. మూడు నిమిషాల ట్రైలర్లోనే 5 సార్లు బికినీ వేసుకొని దర్శనం ఇచ్చింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే రణబీర్ కపూర్ తో ముద్దు సీన్లు కూడా ఎక్కువే చేసినట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా పూర్తిగా ఫన్నీగా సాగే రొమాంటిక్ డ్రామా. హిట్ సినిమాల దర్శకుడు లవ్ రంజన్ తీసిన ఈ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచుతోంది.

Shraddha Kapoor

మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో శ్రద్ద కపూర్ మళ్ళీ విజయాల బాట పడుతుందా అన్నది చూడాలి.

Tu Jhoothi Main Makkaar(Official Trailer) Ranbir,Shraddha |Luv Ranjan | Bhushan K | Ankur G |March 8
 

More

Related Stories